పవన్ ఫ్యాన్ మేడ్ ఎడిట్ ఇంత పని చేసిందా.?

Published on Jun 9, 2021 9:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం రెండు సాలిడ్ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి దర్శకుడు క్రిష్ తో ప్లాన్ చేసిన భారీ పాన్ ఇండియన్ చిత్రం “హరిహర వీరమల్లు” కాగా మరొకటి దర్శకుడు సాగర్ కె చంద్రతో ప్లాన్ చేసిన చిత్రం “అయ్యప్పణం కోషియం” రీమేక్. అయితే ఈ రెండు సినిమాలపై కూడా అంచనాలు ఉన్నాయో బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ తో చిత్రంపై కూడా అంతకు మించిన స్థాయి అంచనాలే ఉన్నాయి.

అయితే ఈ చిత్రం నుంచి అకస్మాత్తుగా నిన్న ఒక అప్డేట్ ను నిర్మాణ సంస్థ వారు తెలియజేసారు. ఈ క్రేజీ కాంబో సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ మంచి సమయం చూసి విడుదల చేస్తామని అందులో ఇంత సడెన్ గా అప్డేట్ ఇవ్వడానికి కారణం పవన్ ఫ్యాన్స్ చేసుకున్న ఫ్యాన్ మేడ్ ఎడిట్ అనే తెలుస్తుంది.

ఒక్కసారిగా సోషల్ మీడియా అంతా షేక్ చేసి వదిలెయ్యగా దానికి సంజాయిషీ చెబుతూ అది అధికారిక ప్రకటనను విడుదల చేసారు. దీనితో దర్శకుడు కూడా స్పందించాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో ఇతర పవన్ అభిమానులు చెప్పుకుంటున్నారు. మొత్తానికి మాత్రం ఆ ఫోటో సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అయ్యి ఇంత పని చేసింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :