“పుష్ప” పై అసలు ఊహించని రూమర్.!

Published on May 6, 2021 11:00 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. దర్శకుడు సుకుమార్ తో బన్నీ చేస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి అలాగే ఈ చిత్రం నుంచి రీసెంట్ గా వచ్చిన టీజర్ కు కూడా భారీ స్థాయి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంపై ఇప్పుడు అసలు ఊహించని రూమర్ బయటకొచ్చింది.

గతంలో సుకుమార్ బన్నీతో ఆర్య, ఆర్య 2 అనే రెండు సినిమాలు ఎలా తీశారో ఇప్పుడు పుష్ప కూడా రెండు పార్ట్స్ గా తీయనున్నారని టాక్ మొదలయ్యింది. అయితే పుష్ప మాత్రం ఒకటే కథ సింకప్ లో ఉంటుందట. మరి ఇందులో ఎంత వరకు నిజముందో కానీ ఈ ఊహించని రూమర్ పై మాత్రం బన్నీ అభిమానులు ఒక అధికారిక క్లారిటీ కోసం కోరుకుంటున్నారు. మరి ఇది జస్ట్ రూమరేనా లేక నిజంగా రెండు భాగాలు ఉందా అన్నది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :