మహేష్ నెక్స్ట్ పై ఈ అప్డేట్ దాదాపు కన్ఫర్మా.?

Published on May 15, 2021 12:26 pm IST

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం అనంతరం దీనిని మించిన అంచనాలు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సెట్ చేసిన చిత్రంపై నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంపై కూడా కొన్నాళ్ల నుంచి మంచి ఇంట్రెస్టింగ్ వార్తలే వినిపిస్తున్నాయి.

అయితే ఈ చిత్రం నుంచి టైటిల్ ఈ వచ్చే మే 31 న అనౌన్స్ కానుంది అన్న టాక్ ఉంది. మరి అది ఇప్పుడు మరింత బలపడుతుంది. దాదాపు ఈ 31 సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రకటించడం కన్ఫర్మ్ అని తెలుస్తుంది. మరి ఆ రోజున ఈ ఆల్ టైం క్లాసిక్ కాంబో నుంచి ఈ మోస్ట్ అవైటెడ్ అప్డేట్ వస్తుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :