అంజలి హారర్ థ్రిల్లర్ విడుదల తేది ఖరారు !

Published on May 1, 2019 10:01 am IST

ప్రముఖ హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ లిసా. తెలుగు, తమిళ భాషల్లో త్రీడి టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజు విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రం ఈనెల 24న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదలకానుంది.

ట్రైడెంట్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మకరంద్ దేశ్ పాండే , యోగి బాబు , సామ్ జోన్స్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక గతంలో అంజలి ‘గీతాంజలి, చిత్రాంగథ’ వంటి హర్రర్ సినిమాల్లో నటించగా అందులో గీతాంజలి సూపర్ హిట్ అయ్యింది. మరి ఈ చిత్రం తో అంజలి మరో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుంటుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

More