ఏప్రిల్ 22న అనామిక ఆడియో

ఏప్రిల్ 22న అనామిక ఆడియో

Published on Apr 21, 2014 11:03 PM IST

anamika
శేఖర్ కమ్ముల తాజా చిత్రం అనామిక ఆడియో ఈ నెల 22న హైదరాబాద్ లో విడుదలకానుంది. తెలుగు సినిమాకు సంబంధించిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.

ఈ సినిమా ఆడియోని ముందుగా ఈ నెల 16న విడుదలచేద్దాం అనుకున్నా ఆ రోజుకు కేవలం సునీత పై చిత్రీకరించిన ఒక ప్రమోషనల్ సాంగ్ ని విడుదలచేశారు. ఈ కహాని రిమేక్ లో నయనతార నటించింది. హైదరాబాద్ లో తన భర్తను పోగొట్టుకుని తనని వెతుక్కునే క్రమంలో పడే కష్టాలను ఈ సినిమాలో చుపించనున్నారు

శేఖర్ కమ్ముల ఈ స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసాడట. నయనతార తన పాత్రని చక్కగా పోషించిందట. కీరవాణి సంగీతదర్శకుడు. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రాఫర్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు