ప్రయోగాలకి పెద్ద పీఠ వేస్తున్న దేవరకొండ

Published on Jan 31, 2020 10:16 am IST

విజయ్ దేవరకొండ సోదరుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ మొదటి చిత్రం ‘దొరసాని’తో తనలోని నటుడ్ని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక రెండవ సినిమా నుండి తన మార్క్ చూపాలనుకున్న అయన ప్రయోగాలకు పెద్ద పీఠ వేస్తున్నాడు. కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ అంటూ కూర్చోకుండా కథకు ప్రాథాన్యమున్న సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే వినోద్ అనంతోజు డైరెక్షన్లో రెండవ సినిమాను స్టార్ట్ చేసిన ఆయన మూడవ చిత్రాన్ని కూడా స్టార్ట్ చేశారు.

ఇందులో ఆనంద్ ఒక స్కూల్ టీచర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇందొక కంప్లీట్ ఎంటెర్టైనర్. తన పాత్రలోనే బోలెడంత ఫన్ ఉంటుందట. కుటుంబానికి, పెళ్లికి మధ్యన నలిగిపోయే స్కూల్ టీచర్ పాత్రట. 1980లో నటులు రాజేంద్రప్రసాద్, నరేష్ చేసిన కామెడీ చిత్రాల తరహాలో ఈ సినిమా ఉంటుందని ఆనంద్ అంటున్నారు. మొత్తానికి ఆనంద్ కామెడీ జానర్లో నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More