వారసులిద్దరూ ఒక్కరోజే వస్తున్నారు…!

Published on Jul 10, 2019 3:08 pm IST

ఈ వారం ఇద్దరు వారసులు టాలీవుడ్ కి పరిచయం అవ్వనున్నారు. ఒకరు రియల్ స్టార్ హీరో తనయుడు మేఘాంష్ కాగా,మరొకరు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. వీరిద్దరూ మొదటిసారి హీరోలుగా నటించిన “రాజ్ దూత్”, “దొరసాని” చిత్రాలు రెండూ ఈనెల 12న విడుదలకానున్నాయి.

అర్జున్-కార్తిక్ అనే ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ రొమాంటిక్ కామెడీ మరియు యాక్షన్ ఎంటర్టైనర్ గా “రాజ్ దూత్” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మేఘాంష్ సరసన హీరోయిన్ గా నక్షత్ర నటిస్తుండగా, లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్తి బాబు నిర్మిస్తున్నారు. శ్రీహరి కుమారుడు కావడంతో పాటు,టీజర్స్ ట్రైలర్స్ అలరించడంతో ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి.

అలాగే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమవుతున్న చిత్రం “దొరసాని” కూడా అదే రోజు విడుదల కానుంది. డైరెక్టర్ మహేంద్ర తెలంగాణాలో దొరలకాలం నాటి ప్రేమకథను హృద్యంగా తెరకెక్కించాడని సమాచారం. హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక కూడా ఈ మూవీతో నటిగా పరిచయమవుతుంది. మధుర శ్రీధర్ రెడ్డి,యాష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఈరెండు చిత్రాలు రెండు వైవిధ్యమైన జోనర్లలో తెరకెక్కినప్పటికీ పోటీ బాగానే ఉంది. మరి ఈ ఇద్దరు యంగ్ హీరోలలో ఎవరు బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం నమోదు చేస్తారో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :

X
More