టీజర్ డేట్ లాక్ చేసిన ‘ఎపిక్’.. ఆ రోజున రచ్చ మామూలుగా ఉండదు!

ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఆదిత్య హసన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీకి పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది.

అయితే, ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన వైష్ణవి చైతన్య మరోసారి హీరోయిన్‌గా నటిస్తుండటంతో ‘బేబీ’ కాంబినేషన్ మళ్ళీ హిట్ రిపీట్ చేస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.

సితార ఎంటర్టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఆనంద్ దేవరకొండ కెరీర్‌లో మరో గుర్తుండిపోయే సినిమా అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Exit mobile version