దొరసాని టీజర్: రాజుగాడిపై మనసుపడిన దొరసాని దేవకి

Published on Jun 6, 2019 11:40 am IST

సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “దొరసాని”. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా, హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక హీరోయిన్ గా తొలిసారి తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. నేడు దగ్గుబాటి రామా నాయడు జయంతిని పురస్కరించుకొని నిర్మాత సురేష్ బాబు చేతుల మీదుగా మూవీ టీజర్ ని విడుదల చేశారు.

దొరసాని దర్శనమే మహాభాగ్యం అనుకొనే పేద రాజుగాడికి దొరసాని ప్రేమ దక్కితే, దాని పరివ్యవసానం ఏమిటి? ధనిక పేద అంతరాల మధ్య దొరసాని దేవకి, రాజుల ప్రేమ గెలిచిందా? అనేదే కథాంశం అని టీజర్ లో స్పష్టంగా చూపించారు.ఈ చిత్రంతో కేవీఆర్ మహేంద్ర దర్శకుడుగా పరిచయం అవుతుండగా, ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నాడు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :

More