భారీ యాక్షన్ సీన్స్ లో ఆనందభైరవి !

Published on Jan 31, 2020 2:31 am IST

అంజలి, లక్ష్మీరాయ్, అధిత్ అరుణ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రం “ఆనంద భైరవి” నంది అవార్డ్ గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని M.V.V. సత్యనారాయణ (వైజాగ్ ఎంపీ) సమర్పణలో “నిధి మూవీస్, హరివెన్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాల పై బి తిరుపతి రెడ్డి, రమేష్ రెడ్డి ఇటికేల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ, వైజాగ్, హైదరాబాద్ లలో చేసిన షూటింగ్ తో 50% షూటింగ్ పూర్తయింది. తదుపరి హైదరాబాద్, చెన్నయ్ లలో ఏకదాటిగా జరిపే షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ పూర్తి చేసి…”సమ్మర్” లో చిత్రాన్ని విడుదల చేస్తాం అని చెప్పారు.

దర్శకుడు కర్రి బాలాజీ మాట్లాడుతూ, ఇప్పుడు వరకు చేసిన షూటింగ్ అద్భుతంగా వచ్చింది. అంజలి, లక్ష్మీరాయ్, అధిత్ అరుణ్ కెమిస్ట్రీ చూస్తుంటే నా కళ్ళముందు నా సక్సెస్ కనిపిస్తుంది. తదుపరి షెడ్యూల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నాo మా సినిమాలో కథాంశానికి తగ్గట్టుగా ప్రతి పాత్రను తీర్చిదిద్దాo. సహజత్వంగా కథకు తగ్గట్టుగా ఉండటం కోసం అంజలి, లక్ష్మీరాయ్ ఎంతో కష్టపడి ప్రత్యేక శిక్షణతో ఎంతో స్లిమ్ గా తయారయ్యారు. అలాంటి కష్టపడే కథానాయికలు మా చిత్రానికి దొరకడం చాలా గర్వంగా ఉంది అలాగే ప్రతి పాత్రకు పెద్ద నటీనటులను ఎన్నుకున్నాం. సమాజంలో ఉన్న ఎన్నో యదార్ధ పాత్రలు మా చిత్రంలో కనబడుతాయి. వాస్తవికతకు దగ్గరగా చిత్రీకరణ జరుపుతున్నాం అని తెలిపారు.

కధానాయిక అంజలి మాట్లాడుతూ, ఆనందిని పాత్రను పోషిస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నా పాత్ర సహజత్వంగా ఉండటంతో మంచి నటనను ప్రదర్శించే అవకాశం కలిగింది. ఈ మధ్య కాలంలో బాగా నచ్చి చేస్తున్న పాత్ర ఇదని చెప్పుకొచ్చారు. లక్ష్మీరాయ్ మాట్లాడుతూ, భైరవి పాత్ర పోషిస్తుంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ముంబాయ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నా అని అన్నారు. హీరో అధిత్ అరుణ్ మాట్లాడుతూ, ఇందులో రొమాంటిక్ బాయ్ అయినప్పటికీ చాలా సన్నివేశాల్ని ఛాలెంజ్ గా తీసికొని చేశా. ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకునే సీన్స్ ఇందులో ఉన్నాయి. అవి చేసేటప్పుడు నేను నిజంగానే ఏడ్చా అని చెప్పారు.

సంబంధిత సమాచారం :