విజయ్ యంగ్ బ్యూటీ కి చాలా విషయాలు చెవుతున్నాడట.

విజయ్ యంగ్ బ్యూటీ కి చాలా విషయాలు చెవుతున్నాడట.

Published on Apr 6, 2020 12:01 PM IST

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే హీరో విజయ్ దేవరకొండను పొగడ్తలతో ముంచేస్తుంది. విజయ్ కైండ్ నెస్ కి ఫిదా అయిపోయాను అంటుంది. దర్శకుడు పూరి జగన్నాద్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో విజయ్, అనన్య పాండే హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఇప్పటికే ఓ లాంగ్ షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ సమయంలో విజయ్ తో గడిపిన సందర్భాలను ప్రస్తావిస్తూ అనన్య ఇలా చెప్పుకొచ్చారు.

విజయ్ పెద్ద స్టార్ అయినప్పటికీ అలాంటి అట్టిట్యూడ్ చూపించరు. చక్కగా కలిసిపోయే ఆయన ఎప్పుడూ ఎదో ఓ విషయాన్ని గూర్చి మాట్లాడుతూ ఉంటారు. నాకు సౌత్ పరిశ్రమ కొత్త కావడంతో ఆయన అనేక కొత్త విషయాలు నాకు నేర్పుతున్నారు. ఆయనతో పనిచేయం చాలా ఆనందంగా ఉంది అని అనన్య చెప్పుకొచ్చారు. ఈ మూవీలో విజయ్ ఫైటర్ గా చేస్తుండగా తెలుగు, హిందీతో పాటు పలు భాషలలో విడుదల కానుంది. పూరి కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు