ఈమెకి “వకీల్ సాబ్” పవన్ సినిమా అని ముందే తెలీదట.!

Published on Apr 7, 2021 9:00 am IST

ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం “వకీల్ సాబ్” విడుదలకు సన్నద్ధం అయిన సంగతి తెలిసిందే. మరి అలాగే పవన్ కం బ్యాక్ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు కూడా సెట్టయ్యాయి. అయితే ఈ చిత్రం బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా తెరకెక్కింది. మరి ఈ చిత్రంలో కీలక పాత్రధారులుగా నివేతా థామస్, అంజలి మరియు తెలుగు యువ నటి అనన్య నాగళ్ళలు నటించారు.

అయితే వీరిలో అనన్య ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఈ సినిమాపై కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలనే చెప్పింది. ఈ చిత్రానికి మొదటగా వేణు తనని “మళ్లేశం” సినిమా చూసి అప్రోచ్ అవ్వడం జరిగింది అని అలా తనని మూడు సార్లు ఆడిషన్స్ జరిగిన తర్వాత కానీ తెలియలేదు ఇది పవన్ కళ్యాణ్ తో సినిమా అని చెప్పింది.

అంతే కాకుండా పవన్ తో సెట్స్ లో సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న అంశాలు చాలా వాటిపై గంటల పాటు మాట్లాడడం మర్చిపోలేనిది అని తెలిపింది. అలాగే ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు ఎలాంటి ప్రాబ్లెమ్ ఉండదని కాకపోతే ఎక్కువమంది తెలుగు అమ్మాయిలు ఇది చెయ్యలేరు అది చెయ్యలేరు అనే మైండ్ సెట్ తో ఉన్నారు అది కనుక మారితే తమకి కూడా మంచి రోల్స్ వస్తాయి అని అనన్య ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలిపింది.

సంబంధిత సమాచారం :