చిరు 152 లో ప్రముఖ యాంకర్ !

Published on Apr 28, 2019 2:00 am IST

ప్రముఖ టీవీ యాంకర్ కమ్ నటి అనసూయ గత ఏడాది రంగస్థలం లో ముఖ్య పాత్రలో నటించి నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఈ సినిమా తరువాత అనసూయ తాజాగా మరో క్రేజీ ఆఫర్ ను సొంతం చేసుకుందని వార్తలు వస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి సైరా తరువాత కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు. ఈ చిత్రంలో అనసూయ కు ఒక ముఖ్య పాత్ర దొరికిందట. ఇక చిరంజీవి ప్రస్తుతం సైరా షూటింగ్ ను పూర్తి చేసేపనిలో వున్నాడు.

జూలై నుండి కొరటాల శివ తో సినిమా స్టార్ట్ చేయనున్నాడు చిరు. ఈచిత్రంలో సునీల్ కూడా ముఖ్య పాత్రలో నటించనున్నాడని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

సంబంధిత సమాచారం :