రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో అనసూయ భరద్వాజ్, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లొ నటిస్తున్న చిత్రం “కథనం”. కాగా ఒక్క సాంగ్ మినహా ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. టైటిల్ తగ్గట్టుగానే థ్రిల్లింగ్ కథనంతో ఈ చిత్రముటుందట.
కాగా మహిళ దినోత్సవం సందర్భంగా ఉపాసన చేతుల మీదుగా ఈ చిత్రం టీజర్ ను విడుదల చేశారు. టీజర్ ను చూస్తుంటే సినిమా ప్రధానంగా క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్నట్లు అర్ధమవుతుంది. అలాగే ‘నిర్ణయాలు తీసుకునేవారు నిద్రపోతుంటే ఎవరో ఒకరు రియాక్ట్ అవుతారు సర్’ అనే డైలాగ్ తో టీజర్ ను ఎండ్ అవ్వడం కూడా చాలా బాగుంది.
ఇక ఈ చిత్రంలో ధనరాజ్, వెన్నెల కిషోర్, రణధీర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గాయత్రి ఫిలింస్, ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నరేందర్ రెడ్డి బట్టేపాటి, శర్మ చుక్కా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమ్మర్ లో విడుదలకానున్న ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.


