శవాల మధ్య డేరింగ్ అనసూయ…”కథనం”, న్యూ పోస్టర్

Published on Jun 5, 2019 12:04 pm IST

జబర్దస్త్ ఫేమ్ అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “కథనం”. అనసూయ అసిస్టెంట్ డైరెక్టరుగా నటిస్తున్న ఈ మూవీని డైరెక్టర్ రాజేష్ నాదెండ్ల సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ ఫోస్టర్, టీజర్ అనసూయ ఓ పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ లో కనిపిస్తారని అర్థం అవుతుంది.
నేడు రంజాన్ సంధర్బంగా శుభాకాంక్షలు తెలుపుతూ అనసూయ మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

చనిపోయిన విలన్స్ అలాగే పోలీస్ శవాల మధ్య చైర్లో నోట్ పాడ్ తో ఎదో రాస్తూ కూర్తున్నట్లు ఉన్న అనసూయ పోజ్ ఆసక్తికరంగా ఉంది. దుర్మార్గులకు హతమార్చే కిల్లర్ లేడీగా అనసూయ కనిపిస్తుందా అనే అనుమానం ఈ పోస్టర్ చూస్తే కలుగుతుంది. జులై లో విడుదలకు రెడీ అవుతున్న ఈ మూవీలో ధన్రాజ్,వెన్నెల కిశోర్,శ్రీనివాస్ అవసరాల ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. బి . నరేంద్రా రెడ్డి , శర్మ చుక్క సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More