“పుష్ప” లో తన రోల్ పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on May 5, 2021 11:00 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఫస్ట్ ఎవర్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. బన్నీ మరియు సుకుమార్ ల కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాపై మంచి అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల టీజర్ తో మరిన్ని అంచనాలు పెంచుకున్న ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ లో ప్రముఖ యాంకర్ మరియు నటి అనసూయ భరద్వాజ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

కొన్నాళ్ల కితమే షూటింగ్ సెట్స్ లో అడుగు పెట్టిన అనసూయ లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన రోల్ కు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాను చేసే రోల్ పై పెద్దగా డీటెయిల్స్ చెప్పను కానీ ఇంతకు ముందు తాను సుకుమార్ గారు “రంగస్థలం”కి కలిస్తే ఎంతటి ఇంపాక్ట్ కలిగిందో ఇప్పుడు పుష్ప తో కూడా అంతకు మించే కలిగిస్తాం అని మాత్రం చాలా కాన్ఫిడెన్స్ గా చెబుతుంది. మరి ఈ సినిమాలో సుకుమార్ ఆమెకి ఎలాంటి రోల్ డిజైన్ చేసారో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం :