అనసూయ సినిమా మోషన్ పొస్టర్ విడుదల చేసిన రానా !

అనసూయ సినిమా మోషన్ పొస్టర్ విడుదల చేసిన రానా !

Published on Oct 21, 2018 2:13 AM IST

రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో అనసూయ భరద్వాజ్, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లొ నటిస్తున్న చిత్రం “కథనం”. గాయత్రి ఫిలింస్, ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నరేందర్ రెడ్డి బట్టేపాటి, శర్మ చుక్కా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా దగ్గుబాటి రానా ఈ చిత్ర ఫస్ట్ లుక్, మోషన్ పొస్టర్ ను సొషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ప్రస్తుతం కథనం చిత్రీకరణ జరుగుతొంది. టైటిల్ తగ్గట్టుగానే థ్రిల్లింగ్ కథనంతో ఈ చిత్రముటుందట.

అయితే దర్శకుడు రాజేష్ మాట్లాడుతూ.. ‘మా‌ కాన్సెప్ట్ నచ్చి రానా మా చిత్ర మోషన్ పొస్టర్ ను, ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. నటిగా అనసూయలోని‌ మరొ కొణాన్ని ఈ చిత్రంలొ చూస్తారని’ తెలిపారు. ధనరాజ్, వెన్నెల కిషోర్, రణధీర్, ముక్తార్ ఖాన్,సమీర్, జబర్దస్త్ శేషు, అప్పారావు తదిరులు నటిస్తొన్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: సతీష్ ముత్యాల, కూర్పు: ఉద్దవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ చౌదరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు