“పుష్ప” సినిమాకు అనసూయ ఎంత రెమ్యునరేషన్ తీసుకుందంటే?

Published on Dec 24, 2021 1:31 am IST


రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో వచ్చిన “రంగస్థలం” సినిమాలో యాంకర్ అనసూయ రంగమత్తగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వచ్చిన “పుష్ప” సినిమాలో కూడా అనసూయ “దాక్షాయని” పాత్రలో మంగళం శ్రీను భార్యగా నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా కోసం అనసూయ ఎంత రెమ్యునరేషన్ తీసుకుని ఉంటుందన్న దానిపై ఇప్పుడు చర్చ మొదలైంది.

ఈ సినిమాలో నటించేందుకుగాను అనసూయ రూ.1-1.5లక్షల రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేసిందని, మొత్తంగా పది రోజులకు పైగానే కాల్షిట్లు ఇచ్చిందని, ఈ లెక్కన దాదాపు రూ.12 లక్షల వరకు తీసుకుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే పుష్ప పార్ట్ 1లో అనసూయ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉందన్న కామెంట్స్‌ బాగా వినిపించాయి. అయితే సెకండ్ పార్ట్‌లో మాత్రం అనసూయ రోల్‌ కీలకంగా మారనుందని సమాచారం.

సంబంధిత సమాచారం :