“పుష్ప”లో నెవర్ బిఫోర్ రోల్ చేస్తున్న అనసూయ.?

Published on Aug 6, 2021 4:47 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే భారీ పాన్ ఇండియన్ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంతే స్థాయి అంచనాలు నెలకొన్నాయి.

మరి ఈ చిత్రంలో అదిరే క్యాస్టింగ్ ను సెట్ చేసిన సుకుమార్ నటి అనసూయ భరద్వాజ్ ని కూడా ఒక కీలక పాత్రలో చూపించనున్నారని తెలిసిందే. అయితే ఆమె రోల్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు కొన్ని అర్ధం అవుతున్నాయి. రీసెంట్ గా పుష్ప ఆన్ లొకేషన్ లో ఉన్నటువంటి పిక్ ఒకటి అనసూయది బయటకొచ్చి వైరల్ అయ్యింది.

మరి అందులో ఆమె కాస్ట్యూమ్ కానీ లుక్ కానీ చూస్తే కాస్త భిన్నంగా ఉందని అర్ధం అవుతుంది. అంతే కాకుండా బహుశా ఒక సాలిడ్ మాస్ నెగిటివ్ టోల్ లో ఆమెని చూపించబోతున్నట్టుగా అర్ధం అవుతుంది. అలాగే ఆమె రోల్ లో వింటేజ్ నటీనటుల షేడ్స్ కూడా కనిపిస్తున్నాయి. దీనితో మొదటి నుంచి అనసూయ చెబుతున్నట్టుగా తన రోల్ ఈ చిత్రంలో నెవర్ బిఫోర్ గానే ఉండేలా ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :