పుష్పలో అనసూయ రోల్ అదే !

Published on May 8, 2021 10:00 pm IST

దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రానున్న సినిమా ‘పుష్ప’. అయితే ‘పుష్ప’ చిత్రంలో అనసూయ కోసం సుకుమార్ ఒక ప్రత్యేక పాత్రను డిజైన్ చేయించాడు. ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త పాత్ర కన్నా, ‘పుష్ప’ సినిమాలో అనసూయ చేస్తోన్న రోల్ మరింత గొప్పగా ఉంటుందని, ఒకవిధంగా రంగమ్మత్త పాత్ర కంటే బలమైన గిరిజన మహిళ పాత్రలో ఆమె నటిస్తోంది. పుష్ప కథని మొత్తంగా మలుపు తిప్పే పాత్ర అట ఆమెది.

ఇక గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే సన్నివేశాలు ఉంటాయని సమాచారం. ఇప్పటికే చిత్రీకరణ ఆలస్యం అయిన నేపథ్యంలో త్వరగా మూవీ పూర్తి చేసే ఆలోచనలో సుకుమార్ ఉన్నాడు. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, బన్నీకి సోదరి పాత్రలో కనిపించబోతుందట.

ఈ సినిమాలో మరో స్పెసల్ సాంగ్ ఉంది. ఆ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ‘ఊర్వశి రౌటెలా’ నటిస్తోంది. అలాగే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఈ సినిమాలో ఓ గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది. పుష్ప సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం :