అదిరిపోయే పాత్రలో అనసూయ !

Published on Dec 5, 2019 8:45 am IST

బుల్లితెర నుండి వెండితెర మీదికి ఎంట్రీ ఇచ్చిన క్రేజీ యాంకర్ అనసూయ ‘రంగస్థలం’ చిత్రంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రసుతం ఎక్కువుగా లేడీ ఒరియెంటెడ్ కథల్ని, కథలో ప్రాధాన్యం కలిగిన పాత్రల్ని మాత్రమే చూజ్ చేసుకుంటూ వస్తోన్న అనసూయకు కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ సినిమాలో కూడా అలాంటి పాత్రలోనే నటించబోతుంది. ఈ సినిమాలో నాటకాలు వేసే ఓ రంగస్థలం నటిగా అనసూయ నటించనుందట. అలాగే సినిమాలో సీన్స్ కి అనుగుణంగా ఓ ప్రత్యేక సాంగ్ లో కూడా అనసూయ నటించాల్సి ఉంటుందట.

మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’కు ఇది రీమేక్. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించనున్నారు. మధు కలిపు, అభిషేక్ జవ్కర్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందంలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా మళ్ళీ కృష్ణవంశీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More