వెండితెరపైకి యాంకర్ సుమ రీ ఎంట్రీ ఇవ్వబోతుందా?

Published on Nov 3, 2021 2:59 am IST


యాంకర్ సుమ.. ఈ పేరు తెలుగు ఆడపడుచులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. దాదాపు మూడు జనరేషన్లకు నచ్చిన ఏకైక యాంకర్ ఎవరైనా ఉన్నారంటే అది సుమ అనే చెప్పాలి. కేరళలో పుట్టి పెరిగినా కూడా తెలుగులో ఎలాంటి తడబాటు లేకుండా తనదైన శైలిలో యాంకరింగ్ చేసే సుమ ప్రస్తుతం టాప్ యాంకర్‌గా కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్స్‌గా రాణిస్తున్న మేల్‌, ఫీమేల్‌ యాంకర్స్‌ కొందరు వెండితెరపై కనిపిస్తున్న సుమ మాత్రం యాంకరింగ్‌లోనే ఫుల్ బిజీగా ఉంది.

అయితే కెరిర్ మొదట్లో పలు చిత్రాల్లో నటించిన సుమ ఆ తర్వాత పలు కారణాల వలన సినిమాల్లో నటించలేదు. అయితే దాదాపు 8 ఏళ్ల తర్వాత సుమ మళ్లీ వెండితెరపై మెరవనున్నట్టు తెలుస్తుంది. పలువురు సెలబ్రిటీలు తన గురించి మాట్లాడిన వీడియో క్లిప్స్ కట్ చేసి ఓ వీడియోను తన ఇన్‌స్టా వేదికగా పంచుకున్న సుమ ‘ఇంతమంది అడుగుతున్నారంటే చేసేస్తే పోలే’ అంటూ చెప్పుకొచ్చింది. దీనిని బట్టి చూస్తుంటే సుమ త్వరలోనే బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

సంబంధిత సమాచారం :