నాగార్జునను డైరెక్టర్ చేసే ఛాన్స్ కొట్టేసిన యాంకర్ !

omkar-nagarjuna
యాంకర్ గా బుల్లితెర మీద ప్రేక్షకులకు పరిచయమై సినీ పరిశ్రమలో దర్శకుడి స్థాయికి ఎదిగిన వ్యక్తి ఓంకార్. ‘జీనియస్’ సినిమాతో దర్శకుడిగా తోలి అడుగు వేసిన ఈయన తరువాత ‘రాజుగారి గది’ చిత్రంతో సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమాకే సీక్వెల్ తీస్తున్నాడు. అంతేకాదు ఆ కథను అక్కినేని నాగార్జునకు చెప్పి అందులో ముఖ్యమైన పాత్ర చేసేలా ఒప్పించాడు కూడా. ఓంకార్ చెప్పిన కథ విని నాగార్జున వెంటనే ఒప్పుకుని కాల్ షీట్లు కూడా ఇవ్వడంతో ఈ సినిమా సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

అందరూ ‘మనం, ఊపిరి, సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి ప్రయోగాత్మక చిత్రాలను ఎంచుకుని హిట్లు అందుకున్న నాగార్జున ఓంకార్ స్క్రిప్ట్ కి ఓకే చెప్పాడంటే అందులో ఖచ్చితంగా ఏదో పెద్ద విషయమే ఉంటుంది అనుకుంటున్నారు. పివిపి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నవంబర్ 27న ఈ చిత్రాన్ని అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఈ సీక్వెల్ కి ‘రాజుగారి గది – 2’ అనే పేరుని ఫిక్స్ చేశారు. సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి ఇంకా తెలియాల్సి ఉంది.

Exit mobile version