“ది బేకర్ అండ్ ది బ్యూటీ” లో విష్ణు ప్రియ…సెప్టెంబర్ 10 నుండి ఆహా లో!

Published on Aug 31, 2021 7:01 pm IST

ది బేకర్ అండ్ ది బ్యూటీ అంటూ ఆహా వీడియో సరికొత్త వెబ్ సిరీస్ ను తెలుగు ప్రేక్షకులకు అందించడానికి సిద్ధంగా ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ సహాయం తో ఈ సీరీస్ ను ఆహా వీడియో తెరకెక్కించడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ లో సంతోష్ శోభన్ మరియు టినా శిల్ప రాజ్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ఆహా వీడియో కృషి చేస్తుంది.

అయితే ఈ వెబ్ సిరీస్ లో ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ నటిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను ఆహా వీడియో తాజాగా విడుదల చేయడం జరిగింది. ఈ విజ్జు గాడు నాకు ప్రపోస్ చేస్తాడా లేదా అంటూ విష్ణు ప్రియ తో ఉన్న పోస్టర్ ను ఆహా వీడియో సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. విష్ణు ప్రియ ఈ వెబ్ సిరీస్ లో మహి పాత్ర లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 10 వ తేదీ నుండి ఆహా వీడియో లో స్ట్రీమ్ కానుంది. రొమాంటిక్ అండ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :