నితిన్ సినిమాలో ఆ బోల్డ్ రోల్ కోసం నయనతార?

Published on Aug 5, 2020 11:25 pm IST


హీరో నితిన్ ఎంతో ముచ్చటపడి హిందీ హిట్ మూవీ అంధాదున్ రీమేక్ చేయడానికి ముందుకు వచ్చారు. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈ మూవీలో బోల్డ్ నెస్ తో కూడిన నెగెటివ్ రోల్ ఒకటి ఉంది. హిందీలో ఆ పాత్రను హీరోయిన్ టబు చేశారు. ఇక తెలుగులో ఈ పాత్ర ఎవరితో చేయించాలి అనే విషయంలో అనేక పేర్లు తెరపైకి వచ్చాయి. రమ్య కృష్ణ, అనసూయ అంటూ అనేక పేర్లు వినిపించాయి. అధికారిక ప్రకటన అయితే ఏది రాలేదు.

కాగా ఈ పాత్ర కోసం స్టార్ హీరోయిన్ నయనతారను తీసుకోవాలనే ప్రయత్నాలలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి మేకర్స్ ఆఫర్ కి నయనతార ఒకే చెబుతుందో లేదో చూడాలి. ఒకవేళ నయనతార ఒప్పుకుంటే ఈ మూవీకి మంచి హైప్ వచ్చి చేరుతుంది. ఇక నితిన్-కీర్తి జంటగా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన రంగ్ దే సంక్రాంతికి విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More