అనుకున్నట్టే జరిగింది..ఆంధ్రాలో 50 శాతం ఆక్యుపెన్సీ ఆంక్షలు

Published on Apr 20, 2021 2:00 am IST

కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ గట్టిగా కనబడుతోంది. మొదటి దఫా లాక్ డౌన్ మూలంగా ఇండస్ట్రీ చాలా నష్టపోయింది. ఆ ప్రభావం నుండి కోలుకోవడానికే పరిశ్రమకు చాలా సమయం పట్టింది. ఈమధ్యనే సినిమాలు వరుసగా విడుదలవుతుండటం, చిత్రీకరణలు పూర్తిస్థాయిలో మొదలయ్యాయి. పెద్ద స్టార్లు అందరూ కొత్త సినిమాలకు సైన్ చేశారు. అంతా బాగానే ఉందని అనుకునే సమయానికి సెకండ్ వేవ్ మొదలైంది. హీరో హీరోయిన్లు వరుసగా వైరస్ బారిన పడుతున్నారు. పెద్ద సినిమా బృందాల్లో చాలామందికి వైరస్ సోకింది.

దాంతో చిత్రీకరణలు కూడ ఆగిపోయాయి. ఇక ఇరు తెలుగు రాష్ట్రాల్లో అయితే కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం మరోసారి ఆంక్షలు విధించే సూచనలు కనిపించాయి. పూర్తి సినిమా హాళ్ల మీద ఆంక్షలు విధించవచ్చని లేకపోతే కనీసం థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన విధించవచ్చని అనుకున్నారు. అనుకున్నట్టే థియేటర్లలో ఇకపై 50 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ అంటూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు విధించింది. ఇక తెలంగాణలో కూడ కేసులు భారీగా వస్తున్నాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం సైతం ఏపీ తరహాలోనే రేపో మాపో 50 శాతం ఆక్యుపెన్సీ ఆంక్షలు విధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

సంబంధిత సమాచారం :