కెరీర్లోనే హయ్యస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న ఆండ్రియా

Published on Jun 15, 2021 9:04 pm IST

తమిళ హీరోయిన్ అండ్రియా మల్టీటాలెంటెడ్. నటిగానే కాకుండా గాయనిగా కూడ మంచి పాపులారిటీ సాధించింది. బోల్డ్ పాత్రలను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుటుంది ఈమె. ప్రస్తుతం ఆండ్రియా ‘పిశాసు-2’లో ప్రధాన పాత్ర చేస్తోంది. ఎం మిస్కిన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో ఆండ్రియా బట్టలు లేకుండా పెర్ఫార్మ్ చేసిందట. సన్నివేశం డిమాండ్ చేయడంతో దర్శకుడి వినతి మేరకు ఆండ్రియా బట్టలు లేకుండా నటించిందట.

కొన్ని సెకన్ల పాటు మాత్రమే ఆండ్రియా అలా కనబడుతుందట. ఈ సన్నివేశాన్ని చిత్రీకరించేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారట టీమ్. ఈ చిత్రానికి గాను ఆండ్రియా తన కెరీర్లోనే అత్యధిక పారితోషకం అందుకోవడం విశేషం. ఈ సినిమా గనుక విజయం సాధిస్తే ఆండ్రియాకు అవకాశాలు పెరగడం ఖాయం. ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి కూడ ఇందులో ఒక కీ రోల్ చేస్తున్నారు. ఇళయరాజా కుమారుడు కార్తీక్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :