సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా.. మారుతి దర్శకుడిగా రానున్న “ప్రతిరోజూ పండగే” డిసెంబర్ 20న విడుదల కానుంది. కాగా చిత్రబృందం మొదటినుంచీ కాస్త వైవిధ్యంగానే ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తున్నారు. బస్ టూర్ తో ఏకంగా ఫ్యాన్స్ దగ్గరికే వెళ్ళింది చిత్రబృందం. ఇప్పుడు మరో కొత్త ఆలోచనతో రేపు థియేటర్ దగ్గర కలుసుకోబోతుంది ఈ చిత్ర హీరోయిన్. ఏంజెల్ ఆర్నా అలియాస్ రాశి ఖన్నా రేపు ఉదయం 11 గంటల 30 నిముషాలకు హైదరాబాద్ లోని ఎర్రగడ్డ దగ్గర గోకుల్ థియేటర్ కు రానుంది. ఆమె నుండి అభిమానులందరూ “ప్రతిరోజూ పండగే” టిక్కెట్లను కొనొచ్చు.
కాగా పల్లెటూరి నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రానుంది. ఈ చిత్రంలో సాయి తేజ్ సరసన గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో వీరిద్దరూ “సుప్రీం” సినిమాలో కలిసి నటించడం జరిగింది. ఇక మిగిలిన కీలక పాత్రల్లో సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ తదితరులు నటిస్తుండగా, ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.


