లెజెండ్రీ దర్శకుడు, అతనుకు మించిన కార్టూనిస్ట్ బాపు గారు రెండు రోజుల క్రితం స్వర్గస్తులైనారు. ఈయన స్థానాన్ని తెలుగు ఎవ్వరూ భారీ చేయలేరు, రారు కూడా.. బాపు గారు ఒక్క తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఎన్నో అద్భుత దృశ్య కావాలను తీసారు. అప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన అనిల్ కపూర్ ని సోలో హీరోగా తెలుగు మరియు హిందీ భాషలకు పరిచయం చేసిన ఘనత కూడా బాపు గారికే దక్కింది.
బాపు గారి మృతితో అనిల్ కపూర్ తీరని బాధకి లోనయ్యారు. ‘నా వరకూ గురువు, ఓ గైడ్, మార్గదర్శి మరియు పిలాసఫర్ అన్నీ బాపు గారే. సినిమా మరియు జీవితం గురించి ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నానని’ అనిల్ కపూర్ అన్నాడు. అనిల్ కపూర్ బ్రదర్ అయిన బోనీ కపూర్ కూడా నిర్మాతగా తన మొదటి సినిమా అయిన ‘హమ్ పాంచ్’ ని బాపు గారి దర్శకత్వంలో తీసాడు. బాపు గారి మరనతో టాలీవుడ్ మొత్తం శోఖ సముద్రంలో మునిగింది.


