యువ దర్శకుడితో బాలకృష్ణ ?

యువ దర్శకుడితో బాలకృష్ణ ?

Published on Sep 18, 2018 11:53 PM IST

హ్యాట్రిక్ విజయాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి నటసింహం బాలకృష్ణ ను డైరెక్ట్ చేయనున్నారని సమాచారం. అయితే ఈవార్తలపై ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం వెలుబడలేదు. ఒక వేళా ఈ వార్తలు కనుక నిజమైతే కామెడీ ఎంటర్టైనెర్ లను తెరకెక్కించడంలో దిట్టయినా అనిల్ ,బాలకృష్ణ కోసం ఎటువంటి స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తాడో చూడాలి.

ఇక అనిల్ ప్రస్తుతం అగ్ర హీరో వెంకటేష్ , యువ హీరో వరుణ తేజ్ కాంబినేషన్ లో ‘ఎఫ్2’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కెనడా లో జరుగుతుంది. ఇక బాలకృష్ణ ‘ఎన్టీఆర్ బయోపిక్’ చిత్ర షూటింగ్ లో బిజీ వున్నారు. ఈరెండు చిత్రాలు కూడా వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదలకానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు