మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచే దిశగా దూసుకుపోతోంది. ఇదే కాకుండా, దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా ఇది హయ్యెస్ట్ గ్రాసర్‌గా మారనుంది.
ఇప్పటివరకు అనిల్ రావిపూడి వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి లాంటి సీనియర్ హీరోలతో సూపర్ హిట్స్ ఇచ్చారు. అయితే ఈ లిస్టులో కింగ్ నాగార్జున మాత్రం మిస్సయ్యారు. ఈ నేపథ్యంలో సినిమా బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్‌లో ఓ జర్నలిస్ట్, నాగార్జునతో సినిమా చేయాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారని అనిల్ రావిపూడిని ప్రశ్నించారు.
దానికి అనిల్ రావిపూడి స్పందిస్తూ.. “గట్టిగా అనుకోండి… అయిపోద్ది..” అంటూ రిప్లై ఇచ్చారు. ఈ సమాధానం నాగ్ అభిమానులను ఖుషీ చేస్తోంది. త్వరలోనే నాగార్జున – అనిల్ రావిపూడి కాంబినేషన్ నిజమవుతుందేమోనని సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.


