‘ఎఫ్ 3’లో మూడవ హీరో మీద క్లారిటీ వచ్చేసింది

Published on Jan 26, 2021 9:03 pm IST

కొద్దిరోజుల క్రితమే ‘ఎఫ్ 3’ చిత్రం లాంచ్ అయిన సంగతి తెలిసిందే. సూపర్ హిట్ ‘ఎఫ్ 2’కు ఇది సీక్వెల్. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గతేడాది జనవరిలో విడుదలైన ‘ఎఫ్ 2’ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. అందుకే ఈ సీక్వెల్ మీద మంచి క్రేజ్ ఉంది. గత నెలలో షూటింగ్ మొదలుకాగా వరుణ్, వెంకీ ఇద్దరూ షూట్లో పాల్గొంటున్నారు. అయితే మొదటి నుండి ఈ సినిమాలో ముగ్గురు హీరోలు నటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఆ మూడవ హీరో రవితేజ, గోపీచంద్, సాయి ధరమ్ తేజ్ అంటూ రూమర్స్ మొదలయ్యాయి.

ఒకానొక దశలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇందులో గెస్ట్ రోల్ చేస్తారని కూడ ప్రచారం జరిగింది. అయితే ఇందులో మూడవ హీరో లేరని దర్శకుడు అనిల్ రావిపూడి తేల్చి చెప్పారట. ఈ కథలో కూడ ‘ఎఫ్ 2’లో ఉన్నట్టే ఇద్దరు హీరోలే ఉంటారని. అసలు తనకు ముగ్గురు హీరోల ఆలోచన లేనేలేదని అన్నారట. ‘ఎఫ్ 2’ భార్య భర్తల గొడవల నేపథ్యంలో ఉంటే ఈ సీక్వెల్ మాత్రం డబ్బు నేపథ్యంలో ఉండనుంది. ‘ఎఫ్ 2’ కు మించిన ఫన్ ఇందులో ఉండేలా చూసుకుంటున్నారు అనిల్ రావిపూడి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత అనిల్ రావిపూడి నుండి వస్తున్న సినిమా కావడంతో సినిమాపై బిజినెస్ వర్గాల్లోనూ డిమాండ్ ఉంది.

సంబంధిత సమాచారం :