దసరాకి బాలయ్య సినిమా రిలీజ్.. నిజమేనా ?

Published on Mar 27, 2022 10:30 pm IST

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి – బాలయ్య బాబు కలయికలో ఒక సినిమా రానున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా షూటింగ్ ను జూన్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక దసరాకి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్రస్తుతానికి చిత్రబృందం టార్గెట్ పెట్టుకుందట. అన్నట్టు ఈ సినిమాలో మరో హీరో కూడా నటిస్తాడని.. అది రవితేజనే అని గతంలో వార్తలు వచ్చాయి.

కాగా సెకండ్ హీరో పాత్ర ఇంటర్వెల్ లో వస్తోందట. ఫస్ట్ హాఫ్ అంతా చాలా సీరియస్ గా సాగుతూ.. ఇంటర్వెల్ కి ఫుల్ కామెడీగా టర్న్ అవుతుందని తెలుస్తోంది. ఇంతకీ ‘బాలయ్య – అనిల్ రావిపూడి’ సినిమా ప్లాన్ ప్రకారం షూటింగ్ పూర్తి చేసుకుని దసరాకి రిలీజ్ అవుతుందా ? లేదా ? అనేది చూడాలి. ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో వరుస విజయాలను అందుకుంటున్నాడు అనిల్ రావిపూడి.

అందుకే, అనిల్ – బాలయ్య కలయికలో సినిమా అనగానే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో కామెడీ డోస్ బాగా ఉంటుందట.

సంబంధిత సమాచారం :