బాలయ్యతో మూవీ మ‌ల్టీస్టార‌ర్ కాదు.. అనిల్ రావిపూడి క్లారిటీ..!

Published on Apr 12, 2022 2:52 am IST


టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం “ఎఫ్-3” సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా మరియు మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మే 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్టుకు సంబంధించి ఒక‌ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు బయటకొచ్చింది.

బాల‌కృష్ణతో అనిల్ రావిపూడి చేయబోతున్న సినిమా మ‌ల్టీ స్టారర్ అని వార్త‌లు వ‌స్తుండ‌గా తాజాగా దీనిపై అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం నేను ఎఫ్-3 మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఉన్నానని, బాల‌కృష్ణ సినిమా కోసం క‌థ ఇప్ప‌టికే రెడీ అయ్యిందని, ఇది సింగిల్ హీరో సినిమా అని అన్నారు. ఎఫ్-3 సినిమా విడుద‌ల తర్వాత మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేస్తామని అనిల్ రవిపూడి తెలిపారు.

సంబంధిత సమాచారం :