నెక్స్ట్ సినిమాపై అనీల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్.. టైటిల్ తోనే రచ్చ

Anil Ravipudi

ప్రస్తుతం మన తెలుగు సినిమా దగ్గర రీజనల్ రాజమౌళి ఎవరైనా ఉన్నారు అంటే అది బ్లాక్ బస్టర్ దర్శకుడు అనీల్ రావిపూడి అనే చెప్పాలి. వరుస బ్లాక్ బస్టర్ లు, ఒకదాన్ని మించి ఒకటి తాను అందిస్తూ రీజనల్ గా తన పేరిట రికార్డులు హైయెస్ట్ గ్రాసర్ లు రాసి పెట్టుకున్నారు. ఈ రెండేళ్ల సంక్రాంతి సినిమాలతో 600 కోట్లకి పైగా గ్రాస్ లు తన పేరిట చెక్కబడ్డాయి.

దీనితో నెక్స్ట్ సినిమా ఏంటి ఎప్పుడు అనేవి కూడా మరింత ఆసక్తి పెంచగా ఫైనల్ గా ఈ సినిమాపై తాను తన మార్క్ స్టేట్మెంట్ ని జారీ చేయడం వైరల్ గా మారింది. తన నెక్స్ట్ సినిమా కూడా సంక్రాంతికే వస్తుండగా ఆ సినిమాకి టైటిల్ అనౌన్స్ చేయడంతోనే మళ్ళీ రచ్చ స్టార్ట్ అవుతుంది అని తాను చెప్పేస్తున్నారు. అంత వెరైటీగా ఆ టైటిల్ ఉంటుందని తాను తెలిపారు.

రీసెంట్ గానే ఆ సినిమా తాలూకా లైన్ ని క్రాక్ చేశామని. అది టైటిల్ అనౌన్స్ చేసినప్పుడే మళ్ళీ వీడు స్టార్ట్ చేశాడ్రా అని చాలా మంది అనుకుంటారు. మళ్ళీ కొట్టేస్తాడు అని అనుకునేవాళ్లు కూడా ఉండొచ్చు అని తెలిపారు. సో ఈ నెక్స్ట్ సంక్రాంతికి కూడా అనీల్ రావిపూడి తన మార్క్ ఎంటర్టైనర్ తో రాబోతున్నారని చెప్పాలి.

Exit mobile version