మూడోసారి బ్లాక్ బస్టర్ నిర్మాతతో అనీల్ రావిపూడి మ్యాడ్ కాంబినేషన్!

మూడోసారి బ్లాక్ బస్టర్ నిర్మాతతో అనీల్ రావిపూడి మ్యాడ్ కాంబినేషన్!

Published on Mar 27, 2026 7:00 PM IST

sahu

మన టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న అతి కొద్ది మంది హిట్ దర్శకుల్లో అనీల్ రావిపూడి కూడా ఒకరు. మరి అనీల్ రావిపూడి ఇది వరకే పలువురు నిర్మాతలతో రెండేసి సినిమాలు కూడా చేసారు. అయితే ఈ ఏడాదిలో మెగాస్టార్ చిరంజీవితో చేసిన రీజనల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ మన శంకర వరప్రసాద్ గారు నిర్మాతల్లో ఒకరైన సాహు గారపాటితో మరో సారి సినిమాకి సిద్ధం అయ్యారు.

మన శంకర వరప్రసాద్ గారు కాకుండా దీనికి ముందు అనీల్ రావిపూడి, బాలయ్య కాంబినేషన్ లో భగవంత్ కేసరి అనే మాస్ హిట్ ని కొట్టారు. ఇప్పుడు మరోసారి వెంకీ మామ, కళ్యాణ్ రామ్ తో చేస్తున్న సినిమాకు వీరు కూడా నిర్మాణం భాద్యతలు అందుకొని హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ పై కన్నేశారు. సో ఈ స్పెషల్ అనౌన్స్మెంట్ ని నేడు రామనవమి కానుకగా మేకర్స్ అందించడం విశేషం. దీనితో అటు షైన్ స్క్రీన్ వారు అలాగే అనీల్ రావిపూడి కూడా ఆనందం వ్యక్తం చేస్తూ తమ కలయికలో సినిమాని మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తున్నారు.

తాజా వార్తలు