ఎఫ్ 2 లో అతిధి పాత్రలో కనిపించనున్న డైరక్టర్ !

Published on Jan 2, 2019 10:24 am IST

హ్యాట్రిక్ చిత్ర విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘ఎఫ్ 2’. ఈచిత్రం విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్ర యూనిట్. ఇక ఈ చిత్రంలో అతిధి పాత్రలో కనిపంచనున్నారు అనిల్ రావిపూడి. క్లైమాక్స్ లో ఆయన ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది. ఇంతకుముందు అనిల్ ‘రాజా ది గ్రేట్’ లో ఒక పాటలో కనిపించారు ఆచిత్రం హిట్ అయ్యింది. మరి ఆ సెంటిమెంట్ ఈ చిత్రానికి కూడా వర్క్ అవుట్ అవుతుందోలేదో చూడాలి.

అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈచిత్రంలో తమన్నా, మెహ్రీన్ కథానాయికలుగా నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఈచిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More