రిపోర్ట్: అందరినీ కలిపి క్రేజీ సాంగ్ ప్లాన్ చేసిన అనీల్ రావిపూడి!

రిపోర్ట్: అందరినీ కలిపి క్రేజీ సాంగ్ ప్లాన్ చేసిన అనీల్ రావిపూడి!

Published on Aug 8, 2026 9:00 AM IST

Anil Ravipudi

విక్టరీ వెంకటేష్ అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ లు హీరోలుగా కీర్తి సురేష్, కృతి శెట్టిలు హీరోయిన్స్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు అనీల్ రావిపూడి కలయికలో మరో సాలిడ్ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మళ్ళీ సంక్రాంతికి మరో సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్న ఈ చిత్రాన్ని మేకర్స్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

ఇలా ప్రస్తుతం సినిమాపై ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ ఇపుడు తెలిసింది. మేకర్స్ ప్రస్తుతం ‘గుంటూరు కారం’ హౌస్ షూట్ లో అది కూడా ఓ క్రేజీ సాంగ్ షూట్ లో బిజీగా ఉన్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. ఈ సాంగ్ షూట్ లో మొత్తం నలుగురు స్టార్స్.. వెంకీ మామ, కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ అలాగే కీర్తి సురేష్ లు పాల్గొననున్నారు.

జీవి ప్రకాష్ మంచి ఎనర్జిటిక్ ట్యూన్ అందించినట్టు తెలుస్తుంది. ఇక ఈ షెడ్యూల్ ఈ ఆగస్ట్ 20 వరకు కొనసాగనుందట. సో మొత్తానికి ఇలా షూట్ సూపర్ ఫాస్ట్ గా పూర్తవుతుంది. ఇక ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ అలాగే షైన్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు