మన టాలీవుడ్ లో తమ సినిమాలని జనాల్లోకి తీసుకెళ్లాలి అంటే జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి అలాగే దర్శకుడు అనీల్ రావిపూడిల కోసమే మొదట మాట్లాడొచ్చు. ఇద్దరి సినిమాలు ఆఫ్ లైన్ ఆన్లైన్ జనాల్లోకి తమ మార్క్ ప్రమోషన్స్ తో వెళ్లిపోతాయి. అయితే అనీల్ రావిపూడి లేటెస్ట్ గా క్రేజీ మల్టీస్టారర్ సినిమా వెంకీ మామా, కళ్యాణ్ రామ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇంకా షూట్ మొదలు కాకుండానే తాము ఎంటర్టైన్మెంట్ తో కూడిన ప్రమోషన్స్ ని కూడా స్టార్ట్ చేసారు. కానీ సినిమా పేరిట జరుగుతున్న ఫేక్ కాస్టింగ్ విషయాన్ని కూడా ప్రమోషన్స్ గా మార్చేయడం మాత్రం అనీల్ రావిపూడికి మాత్రమే చెల్లింది. చిన్న పిల్లలు కావాలని జరుగుతున్న ఫేక్ కాస్టింగ్ లో అలెర్ట్ అయ్యిన ఓ తండ్రి తోనే స్వయంగా సినిమా నటీనటులు ఎంపిక విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఇలాంటివి జరిగితే ఎవరైనా కేవలం ప్రెస్ నోట్ ఇచ్చి వదిలేస్తారు. కానీ ఇక్కడ ఉన్నది రావిపూడి కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయడం జరిగింది. సో ఇదీ ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
⚠️ FAKE CASTING ALERT ⚠️
Any casting call currently being circulated in the name of #VenkyAnil5 – #NKRAR2 is FAKE and unauthorized.
We urge aspiring artists and the general public not to fall prey to such scams.
Any official casting-related announcements will be made only… pic.twitter.com/NlLunpq20k
— Shine Screens (@Shine_Screens) June 22, 2026


