“ఎఫ్ 3” మళ్ళీ ఆ రేస్ లోకేనా.?

Published on Apr 29, 2021 1:30 am IST

మళ్ళీ మన దేశంలో పెరుగుతున్న కరోనా పరిస్థితుల నిమిత్తం సినీ పరిశ్రమకు దెబ్బ పడింది. భారీ ఎత్తున కరోనా పెరుగుతుండడంతో అనేక సినిమాలు షూటింగ్స్ ఇప్పటికే ఆగిపోయాయి. అంతే కాకుండా విడుదలలు కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి. మరి ఈ లిస్ట్ లో వెంకీ మామ మరియు వరుణ్ తేజ్ ల కాంబోలో అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న హిట్ సీక్వెల్ “ఎఫ్ 3” కూడా చేరేలా ఉందని తెలుస్తుంది.

ఆల్రెడీ కొంత మేర షూట్ ను కంప్లీట్ చేసేసుకున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగష్టు రేస్ లో ఉంచాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ చిత్రం అప్పుడు “ఎఫ్ 2” రిలీజ్ కాబడిన సంక్రాంతి రేస్ లోనే నిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే ఈ చిత్రంలో తమన్నా మరియు మెహ్రీన్ లే హీరోయిన్స్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :