మెగా ఉత్సవం.. రికార్డుల విధ్వంసం – అనిల్ రావిపూడి

మెగా ఉత్సవం.. రికార్డుల విధ్వంసం – అనిల్ రావిపూడి

Published on Jan 26, 2026 11:03 AM IST

Anil Ravipudi

దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) ‘మన శంకర వరప్రసాద్‌గారు’తో తన కెరీర్ లో వరుసగా 9వ విజయాన్ని అందుకున్నాడు. ఇదే విషయం పై ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ లో అనిల్ రావిపూడి (Anil Ravipudi) మాట్లాడుతూ.. ‘నాకు వరుసగా 9 విజయాలను అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ఇది మెగా ఉత్సవం.. విక్టరీ విన్యాసం.. రికార్డుల విధ్వంసం.. డిస్ట్రిబ్యూటర్ల మహదానందం.. ధనాధన్‌’ అంటూ ఈ సినిమాలో ఫేమస్‌ డైలాగును అనిల్ రావిపూడి మార్చి చెప్పారు.

అనిల్ రావిపూడి ఇంకా మాట్లాడుతూ.. ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ ఒక ఏటీపీ (ఆల్‌ టైమ్‌ ప్రభంజనం). రెండు వారాల నుంచి ఈ ఏటీపీనే మోత మోగిపోతోంది. ఇలాంటివి చిరంజీవి మరిన్ని చేయాలని కోరుకుంటున్నా. నా ఈ చిరు జర్నీని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను’’ అని అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) తెలిపారు. ఈ పూర్తి స్థాయి ఎంటర్టైనర్ లో నయనతార కథానాయికగా నటించింది. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.

తాజా వార్తలు