బాలకృష్ణ ఇమేజ్ కి సరిపోయే సబ్జెక్ట్ అట !

బాలకృష్ణ ఇమేజ్ కి సరిపోయే సబ్జెక్ట్ అట !

Published on May 10, 2021 5:40 PM IST

నందమూరి బాలకృష్ణ కోసం ఓ భారీ యాక్షన్ కామెడీ సబ్జెక్ట్ ను రాసినట్లు అనిల్ రావిపూడి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ చిత్రం తన మునుపటి బ్లాక్ బస్టర్ ‘పటాస్’ తరహాలో ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇక కథ బాలకృష్ణ ఇమేజ్ కి కరెక్ట్ గా సరిపోతుందని తెలియజేశాడు. ఇక తన ఎఫ్ 3 తరువాత తదుపరి ప్రాజెక్ట్ గా బాలకృష్ణ సినిమానే డైరెక్ట్ చేయబోతున్నాడు.

ఈ జనరేషన్ డైరెక్టర్స్ లో డీసెంట్ కామెడీని హ్యాండిల్ చేయడంలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ తో కలిసి ‘ఎఫ్ 3’ సినిమా చేస్తున్నాడు. కరోనా లేకపోయి ఉంటే, ఈ పాటికే బిజీ షెడ్యూల్స్ తో వరుసగా షూటింగ్ జరుపుకుంటూ ఉండేది ఈ సినిమా. కానీ, ఏమి చేస్తాం.. కరోనా దెబ్బకు ఈ సినిమా మరో ఏడాదికి పోస్ట్ ఫోన్ అయిపోయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు