‘ఎఫ్ 3’ స్పెషల్ సాంగ్ లో బాలయ్య హీరోయిన్స్ ?

Published on Jun 19, 2021 10:02 pm IST

టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస సక్సెస్ లతో సూపర్ హిట్స్ కొడుతూ ప్రస్తుతం వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ లతో కలిసి ‘ఎఫ్ 3’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందట. ఈ సాంగ్ లో ఇద్దరు హీరోయిన్లు నటించే ఛాన్స్ ఉందట. ఆ ఇద్దరు హీరోయిన్స్ లిస్ట్ లో ఆల్ రెడీ బాలీవుడ్ హీరోయిన్ సోనాలి చౌహాన్ ఎప్పుడో చేరిపోయిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు మిగిలిన హీరోయిన్ ను కూడా ఫైనల్ చేసిన్నట్లు టాక్ నడుస్తోంది. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఈ సాంగ్ లో కనిపించనుంది.

అయితే, ఈ ఇద్దరు హీరోయిన్స్ బాలయ్య సినిమాల్లో నటించారు, ప్రస్తుతం ‘బాలయ్య’ అఖండ సినిమాలో కూడా ప్రగ్యా హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఆ మధ్య ఎఫ్ 3 కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే, డబ్బులతో నింపిన ట్రాలీలను నెట్టు కెళుతున్న వెంకటేష్, వరుణ్ లుక్ ఆసక్తి రేపగా… ఇది డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా అని తెలియజేశారు. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. రాజేంద్రప్రసాద్ తో పాటు వెన్నెల కిషోర్, సునీల్ క్యారెక్టర్స్ కూడా ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉంటాయట.

సంబంధిత సమాచారం :