‘ఎఫ్ 3’ కన్ ఫ్యూజన్ క్యారెక్టర్ లో రవితేజ ?

Published on Nov 29, 2020 7:50 pm IST

టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ప్రస్తుతం వరుస సక్సెస్ లతో సూపర్ హిట్స్ కొట్టేసి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు, డీసెంట్ కామెడీని హ్యాండిల్ చేయడంలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని, తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి.. ప్రస్తుతం కామెడీ కింగ్ వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ లతో కలిసి ‘ఎఫ్ 3’ చేస్తోన్న సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ ఉందని ప్రీక్లైమాక్స్ లో వచ్చే ఆ పాత్ర పూర్తీ కన్ ఫ్యూజన్ తో సాగుతూ ఫుల్ గా నవ్విస్తోందని.. ఇద్దరి హీరోలను ఫుల్ గా ఇరకాటంలో పెట్టే ఆ పాత్రలో రవితేజ నటించబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్ ను రెడీ చేసేశాడు. ప్రస్తుతం వెంక్కీ ‘నారప్ప’ సినిమా చేస్తున్నాడు, వరుణ్ తేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఒక చిత్రం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు తర్వాత చేయడానికి వరుణ్, వెంకీల నుండి రాబోతున్న సినిమా ‘ఎఫ్ 3’నే.

సంబంధిత సమాచారం :

More