కీలక పార్ట్ పూర్తయిందట.. క్లైమాక్స్ ఒక్కటే బ్యాలెన్స్ !

Published on Apr 3, 2021 7:05 pm IST

విక్టరీ వెంకటేష్ యంగ్ హీరో వరుణ్ తేజ్ కలయికలో వస్తోన్న ‘ఎఫ్ 3’ సినిమా షూటింగ్ ఇప్పటికే కీలక భాగం పూర్తయిందని తెలుస్తోంది. లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ సారధి స్టూడియోలో శరవేగంగా జరుపుకుంది. ఆ తరువాత హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా, తరువాత షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ తోటి సినిమాలో కీలక పార్ట్ ఫినిష్ అవుతుందని.. ఇక ఒక్క క్లైమాక్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో వెంకీ వరుణ్ ల కామెడీ సీన్స్ తో పాటు ‘సునీల్ – రాజేంద్ర ప్రసాద్’ కామెడీ ట్రాక్ కూడా అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సీక్వెల్ లో త‌మ‌న్నా, మెహ‌రీన్‌లే క‌థానాయిక‌లుగా న‌టించబోతున్నారు. వీళ్ళు వెంకీ వరుణ్ లను పెట్టే టార్చర్ వల్లే.. వాళ్ళ జీవితాలు డబ్బులు చుట్టూ తిరుగుతాయట. మొత్తానికి భార్యల టార్చరే ఎఫ్ 3 కథకు మెయిన్ మోటివ్ అని సమాచారం.

ఇక ఈ జనరేషన్ లో కామెడీని హ్యాండిల్ చేయడంలో బెస్ట్ ఎవరు అనగానే ముందుగా అనిల్ రావిపూడి పేరే ముందువరుసలో ఉంటుంది. అంతగా అనిల్ టాలీవుడ్ లో తన మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు.

సంబంధిత సమాచారం :