‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు !

Published on Nov 7, 2019 3:00 am IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ విశేషాల గురించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్ర నిర్మాత అనీల్ సుంకర మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను కశ్మీర్‌లో చిత్రీకరించాల్సి వచ్చింది. అయితే కశ్మీర్‌ లో మా సినిమా షూటింగ్ కి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అనుమతి ఇచ్చారు. అలాగే మహేష్ బాబుకి కూడా బుల్లెట్‌ ప్రూఫ్‌ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అయితే షూటింగ్ సమయంలో చాల ఆంక్షలు పెట్టారు. ఎందుకు ఇన్ని ఆంక్షలు పెడుతున్నారో అప్పుడు మాకు అర్థం కాలేదు. ఆ తరువాత ఆర్టికల్‌ 370 రద్దు గురించి తెలిసాక అర్థమైంది. అయితే ఆర్టికల్‌ 370 రద్దు జరగడానికి ఒకరోజు ముందు, కశ్మీర్‌లో మా సినిమా షూటింగ్‌ ముగిసింది అని చెప్పుకొచ్చారు.

కాగా ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ముగించుకున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

X
More