‘యుటర్న్’ కు కుడా అనిరుధ్ ను దించుతున్నారు !

Anirudh

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సినిమాలకు సంగీతం అందించడంతో పాటు మ్యూజిక్ వీడియోలు కూడా చేస్తుంటాడు. ఈ తరహా మ్యూజిక్ వీడియోలతోఎక్కువ మందిని థియేటర్లకు రప్పించడంలో ప్రసిద్ధుడైన అనిరుద్ ఇటీవల నయనతార నటించిన ‘కొలమావు కోకిల’ చిత్రానికి కూడా మ్యూజిక్ వీడియోలో కనిపించి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సఫలం అయ్యాడు. ఇప్పుడు ఈచిత్రం అక్కడ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

ఇక ఇప్పుడు ఇదే స్ట్రాటజీని తను నటించిన ‘యు టర్న్’ చిత్రానికి ఉపయోగిస్తుంది సమంత. ఈసినిమా కోసం చిత్రీకరించనున్న మ్యూజిక్ వీడియోలో అనిరుధ్ కనిపించనున్నాడు. ఇందులో ట్రాక్ ను కూడా ఆయనే పాడనున్నాడు. కానీ ఇది సినిమాలో ఉండదు. మరి ఈప్రమోషనల్ వీడియో సాంగ్ సినిమాకు ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.

ఇక యు టర్న్ చిత్రం వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 13న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. భూమిక , అది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈచిత్రాన్ని పవన్ కుమార్ తెరకెక్కిస్తున్నారు.

Exit mobile version