‘కింగ్డమ్’ ఫస్ట్ రివ్యూ ఇచ్చిన అనిరుధ్

‘కింగ్డమ్’ ఫస్ట్ రివ్యూ ఇచ్చిన అనిరుధ్

Published on May 4, 2025 3:00 AM IST

kingdom 1

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో ‘కింగ్డమ్’ కూడా ఒకటి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాను స్పై థ్రిల్లర్‌గా మేకర్స్ రూపొందిస్తున్నారు. అయితే, ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూని మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఇచ్చేశాడు. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాను తాను 40 శాతం చూశానని.. ఇప్పటికే సినిమా తనకు పిచ్చపిచ్చగా నచ్చేసిందని.. ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన తెలిపాడు.

కేవలం సగం సినిమా చేసిన అనిరుధ్ ఇలా సినిమాపై సూపర్ కాన్ఫిడెంట్‌గా ఉండటంతో ఈ మూవీపై మేకర్స్ ధీమాగా ఉన్నారు. ఇక భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మే 30న ఈ సినిమా వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

తాజా వార్తలు