సూర్య తాజా సినిమా అంజాన్ ఫస్ట్ లుక్ మే 1న విడుదలకానుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ లో కొన్ని వర్కింగ్ స్టిల్స్ చక్కర్లు కొడుతున్నాయి. చిత్ర బృందం కొన్ని పోస్టర్లను అధికారికంగా విడుదల చేయనున్నారు
లింగుస్వామి దర్శకత్వం లో తిరుపతి బ్రదర్స్ మరియు యు.టి.వి మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోవాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో సూర్యకు చిన్న గాయం కూడా అయ్యింది. ఈ గాయంపై నిర్మాతలు పెదవివిప్పకపోయినా సూర్య ఇటీవలే చెన్నైలో చేతికర్ర సాయంతో నడిచాడు
ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. యువన్ శంకర్ రాజా సంగీతదర్శకుడు. సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్


