‘అంజలి’కి సెన్సార్ అయిపొయింది !

‘అంజలి’కి సెన్సార్ అయిపొయింది !

Published on Feb 13, 2019 10:50 PM IST

తమిళంలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ నయనతార నటించన తమిళ్ సినిమా ‘ఇమైక్క నొడిగల్’. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో ‘అంజలి సిబిఐ ఆఫీసర్’ పేరుతో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

‘U/A ‘ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది. తమిళ యంగ్ హీరో అథర్వ, బబ్లీ హీరోయిన్ రాశీఖన్నా అలాగే బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఓ గెస్ట్ రోల్ లో నటించారు.

ఈ సినిమాకు ఆర్.అజయ్ గననముత్తు దర్శకత్వం వహించాడు. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు